మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామ్యకం -ఖండించిన దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేయడం దుర్మార్గం అని, ప్రజాస్వామికం అని వైసిపి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ.. ఆదివారం కాకాణి గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేశామని పోలీసు ధృవీకరించారని, ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటలకు గోవర్ధన్ రెడ్డి ని అరెస్టు చేస్తే ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న కనీస సమాచారం కూడా లేకుండా గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధమని …మాజీ మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు కనీస సమాచారం ఇవ్వాలన్న బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ కు లేకపోవడం బాధ్యత రాహిత్యమేనని అన్నారు.ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఈ విధంగా అక్రమ కేసులు నమోదు చేయడం జరగలేదని, గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇది మంచి పద్ధతి కాదని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖండించారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి క్లీన్ చిట్ తో బయటికి వస్తారని నమ్మకం తమకుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కాకాణి గోవర్ధన్ రెడ్డి కి అండగా నిలుస్తుందనీ అన్నారు.ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది అప్రజాస్వామ్యకం అని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *