వై.ఏస్ ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ఎస్సీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామికి వేంపల్లి మండల టిడిపి నేతలు వినతిపత్రం అందజేశారు. మంగళవారం నాడు వేంపల్లి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిసి టిడిపి నేతలు వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సానుకూలంగా స్పందించారు. హాస్టల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రికి వేంపల్లె మండల టిడిపి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
