తాళ్లూరు మండలంలో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు , మాజీ సీఎం ఎన్ టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పాలనకు ఆద్యుడిగా ఆయన పేదల పక్షపాతిగా రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ టిఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న నిర్ణయంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీడీఓ దార హనుమంత రావు, కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యం, ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహణ కార్యదర్శి శాగం కొండా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, నీటి సంఘం వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి. వంగపల్లి నాగేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మి నారాయణ, పార్టీ కొత్త పాలెం అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, చాట్ల డాని, సోము శ్రీనివాస రెడ్డి, పోలం రెడ్డి రమణా రెడ్డి, అనపర్తి సుబ్బారావు, నాదేడ్ల శ్రీను, అనపర్తి సుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువనాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మహానాడుకు తరలివెళ్లారు.

