పాఠశాలలు ప్రారంభించేనాటికి సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు పూర్తి చేయాలి -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

పాఠశాలలు ప్రారంభించే నాటికి జిల్లాలోని ఎస్సి సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పాఠశాలలు ప్రారంభించేనాటికి జిల్లాలోని ఎస్సి సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా పెండింగ్ లేకుండా అన్ని వసతి గృహాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు.
ఒంగోలు,యర్రగొండపాలెంలో నూతన వసతి గృహాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *