సమాచార శాఖలో సుమారు 38 ఏళ్లపాటు టైపిస్టుగా విధులు నిర్వహించి శనివారం ఉద్యోగ విరమణ చేసిన ఓ.ఇందిరా కుమారికి సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు ఘన వీడ్కోలు పలికారు. మార్కాపురం డివిజన్ కార్యాలయంతో పాటు ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో ఆమె విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.పి.ఆర్.ఓ. వేణుగోపాల్, డి.పి.ఆర్.ఓ. రమేష్, డివిజనల్ పి.ఆర్.ఓ. దుర్గాప్రసాద్, రిటైర్డ్ డి.ఈ.ఐ.ఈ. రమణమూర్తి, రిటైర్డ్ డి.పి.ఆర్.ఓ. నారాయణ, కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు.