యోగాంధ్ర -2025 మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

యోగాంధ్ర -2025 మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పిలుపు నిచ్చారు.
శనివారం ఒంగోలులోని జడ్పి సమావేశ మందిరంలో ఆయన యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ యోగాంధ్ర క్యాంపెయిన్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుని యోగాంధ్ర -2025 మాసోత్సవాల్లో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *