క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వానికే సాధ్యం – డాక్టర్ గొట్టిపాటి

ఏడాది పాలనలో క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని శివరామపురం గ్రామంలో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ … ప్రతి అవ్వ, తాత మోములో ఆనందాన్ని చూడలన్నదే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్లు పంపిణీ మంజూరు చేస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోనికి నెట్టివేసారని ఆరోపించారు. ప్రస్తుతం పాలన గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 2047 మిషనరీ మన సీఎం చంద్రబాబు, పీఎం మోదీజీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఏడాది జూన్ నుండి రూ.15వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఆగష్టు నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైపు ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. అదే న్పూర్తితో దర్శి నియోజక వర్గం కూడ అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ముందుగా శివరామపురం టిడిపి గ్రామ నాయకులు, మహిళలు డాక్టర్ గొట్టిపాటికి ఘన స్వాగతం పలికారు. చిన్నారులు కోలాటం వేస్తూ ఆమెకు స్వాగతం పలికారు. మహిళలకు, పెన్షన్ దారులకు అప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ పంపిణీ చేసారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాన రావు, తాళ్లూరు, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, శాగం కొండా రెడ్డి, షేక్ పెదకాలేషా వలి (బడే), పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, నీటి కమిటి వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, గొంది రమణా రెడ్డి (నమర), తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, రామయ్య, మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మి నారాయణ, ఉప సర్పంచి రామ్మూర్తి, నారిపెద్ది రామయ్య, పవన్ కళ్యాణ్, తిరుపతి స్వామి, బ్రహ్మయ్య, కాశి రెడ్డి, నత్యం, గ్రామ కార్యదర్శి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *