తాళ్లూరు మండలంలోని నాలుగు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డులకు ఎంపికయినట్లు మండల విద్యాశాఖాధికారులు జి నుబ్బయ్య, సుధాకర్ రావులు తెలిపారు. అందులో తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్ కి చెందిన చల్లా రేవతి, బి ఈశ్వర్ నాయక్ లు, ఎబీసీ హైస్కూల్ కి చెందిన ఇడమకంటి స్నేహితా రెడ్డి, అనపర్తి మైకేల్ తూర్పుగంగవరం గీతాంజలి హైస్కూల్ కి చెందిన కె మధు శివ ప్రసాద్, శారద హైస్కూల్ కు చెందిన షేక్ మాలిక్ లు ఎంపికయ్యారు. ఎంపిక అయిన విద్యార్థులకు ఎంఈఓ-1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు, ఆయా పాఠశాల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలిపారు.
ప్రతిభ అవార్డులకు ఎంపికయిన తాళ్లూరు మండల విద్యార్థులు వీరే
06
Jun