సికింద్రాబాద్, జూన్ 8 (జే ఎస్ డి ఎం న్యూస్):
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే జీ. ఎం.అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫిట్ ఇండియా సైక్లోథాన్ కార్యక్రమాన్ని జీ ఎం జెండా ఊపి ప్రారంభించారు.ఈ సైకిల్ యాత్రలో అరుణ్ కుమార్ జైన్ ఇతర రైల్వే అధికారులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఎస్ .సి. ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా స్కీమ్ – ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహించారు. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో, ఆరోగ్యాన్ని మన దైనందిన జీవితంలో భాగంగా మార్చే లక్ష్యంతో
ఈ కార్యక్రమం చేపట్టారు. రైల్వే ఉద్యోగులకు ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వేలో ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రైల్వే క్రీడా సంఘాన్ని ఆయన అభినందించారు. ఆరోగ్యంగా ఉండటం ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించిందనీ పేర్కొన్నారు .సైక్లింగ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు .విదేశాల్లో ఇప్పుడు మళ్లీ చాలా మంది ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్‌కు వైపు మళ్లుతున్నారనీతెలిపారు .
దీనివల్ల పర్యావరణ పరిరక్షణ కాకుండా శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది,అని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైల్వే ఉద్యోగి ఈ ఉద్యమంలో చురుకుగా భాగస్వామి కావాలని జీఎం పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు
ప్రధాన నిర్వహణాధికారి
నీరజ్ అగర్వాల్, డీ ఆర్ ఎం భర్తేష్ కుమార్ జైన్ (సికింద్రాబాద్ డివిజన్), ఇతర సీనియర్ రైల్వే అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా ప్రజలందరినీఆరోగ్యవంతమైన జీవనశైలికి దారి తీసేలా, ప్రధానమంత్రి విజన్ ఆధ్వర్యంలో రూపొందిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా “సండేస్ ఆన్ సైకిల్” అనే థీమాటిక్ క్యాంపెయిన్ ప్రారంభించబడింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖతో పాటు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం జరిగే ఈ సైక్లింగ్ క్యాంపెయిన్‌తో ఫిట్‌నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది.


