కాచిగూడ రైల్వేస్టేషన్ లోపా సాడ్ ఇల్యూమినేషన్ లైటింగ్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి.

హైదరాబాద్ జూన్ 9 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కేంద్రపర్యాటకశాఖఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చేతుల మీదుగా సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాంల ఏలుబడిలో 1916 లో గోతిక్ శైలిలో నిర్మాణం జరుపుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశామని అన్నారు.
ఇకపై ఈ ఇల్యుమినేషన్ లైట్ల వెలుగులో కాచిగూడ రైల్వేస్టేషన్ బిల్డింగ్
ఎంతో చూడముచ్చటగా కనిపించనుందన్నారు.
నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారన్నారు.
ఫసాడ్ లైటింగ్ వ్యవస్థ ద్వారా వీరందరికీ కాచిగూడ రైల్వేస్టేషన్ చారిత్రక ప్రాముఖ్యత తెలియయనుందనీ ఆయన పేర్కొన్నారు.కాచిగూడ రైల్వేస్టేషన్ చారిత్రక నేపథ్యం కలిగి ఉండటమే కాకుండా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పర్యావరణ పరిరక్షణలో కూడా తనవంతు పాత్రను పోషిస్తోందన్నారు.
గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ప్లాటినం రేటింగ్ ఇచ్చింది.అంతేకాకుండా, భారతీయ రైల్వేలో ఎనర్జీ ఎఫిషియంట్ స్టేషన్ గా కాచిగూడ రైల్వేస్టేషన్ నిలిచింది. భారతీయ రైల్వేలో మొట్టమొదటి డిజిటల్ పేమెంట్ సేవలు కూడా కాచిగూడ రైల్వేస్టేషన్ లోనే ప్రారంభమయ్యాయి.
ఇలా ఎన్నో రకాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నాం అని ఆయన తెలియ జేశారు.
రాష్ట్రంలో దాదాపు రూ. 2,750 కోట్లతో మొత్తం 40 రైల్వేస్టేషన్లను వచ్చే 30 సంవత్సరాల అవసరాలను తీర్చేలా పునరాభివృద్ధి చేస్తున్నారు.అందులో పునరాభివృద్ధి పూర్తి చేసుకున్న బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే ప్రారంభించారనీ ఆయన గుర్తు చేశారు.అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకితీసుకురావడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు జరిగాయన్నారు.
నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ల మీద ఒత్తిడిని తగ్గించటం కోసం రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ ను కూడా ప్రధానమంత్రి ఇటీవలే ప్రారంభించారు
రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వే రంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో గత 11 ఏళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించింది. గత 11 ఏళ్లలో.. తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్ రెట్టింపవగా. రైల్వేల నెట్‌వర్క్ మూడింతలు పెరిగిందన్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు గత 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ. 30,832 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.
ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2014కు ముందు తెలంగాణ వ్యాప్తంగా ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వేలైన్ల నిర్మాణం జరిగితే.. నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణంజరుగుతోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎం ఏం టి ఎస్ -ఫేజ్ 2లో భాగంగా పలుప్రాజెక్టులనుప్రారంభించారు.దాదాపు 700 కోట్లతో వరంగల్ లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ ఎం యు ) కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీని పనులు కూడా చాలా వేగంగాసాగుతున్నాయి.
దీని ద్వారా ప్రత్యక్షంగా 3వేల మందికి.. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుంది.
ఈ పదకొండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 444 కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల పనులు తెలంగాణలో పూర్తయ్యాయి.
మూడు పెద్ద ప్రాజెక్టులు: సికింద్రాబాద్-మహబూబ్‌నగర్, రాఘవాపురం-మందమర్రి, ఎం ఎం టి ఎస్ ఫేజ్ టూ
2004-14 మధ్యలో తెలంగాణలో 759 కిలోమీటర్ల మేర రైల్వైలైన్ల విద్యుదీకరణ పూర్తయితే.. ఈ 11 ఏళ్లలో 1,890 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయింది.
నూతనంగా నిర్మిస్తున్న రైల్వేలైన్లను మినహాయిస్తే తెలంగాణలోని రైల్వే లైన్లన్నీ 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాయి.ఇవి కాకుండా.. తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ.. ఇన్నాళ్లుగా తెలంగాణలో రైలు కూతకోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు.. రైలు పట్టాలు వేసి అక్కడి ప్రజలకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు రైల్వేశాఖ పనులు చేపట్టింది.
మెదక్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు మొదటిసారి రైల్వేసేవలు అందుబాటులోకి వచ్చాయి.రైల్వేల విషయంలో తెలంగాణకు ఓ ప్రత్యేకత ఉంది.స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైల్వే రక్షణ వ్యవస్థ ‘కవచ్’.. మన తెలంగాణలోనే మొదటిసారి ప్రయోగించారు.
దీన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారు.ఈ వ్యవస్థలో మరింత పరిశోధలను జరిపే లక్ష్యంతో.. సికింద్రాబాద్ లో ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (సి ఓ ఈ ) యూనిట్‌నుఏర్పాటుచేసుకున్నాం.రానున్న రోజుల్లో ఈ కేంద్రం ద్వారా మరింత విస్తృతమైన పరిశోధనలు జరిగేలా. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది.తెలంగాణలో ఈ 11 ఏళ్లలో రైల్వేల పురోగతికి.స్పష్టమైన ఆలోచనతో కూడిన ప్రణాళిక సరైన సమయానికి ప్రాజెక్టుల పూర్తి అవసరమైన నిధులను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వ ముందుచూపు కారణంగా. జరిగిన పురోగతి మనకళ్లముందుకనబడుతోంది.
ఇదే స్ఫూర్తితో.2047 నాటికి వికసిత్ భారత నిర్మాణానికి మనమంతా కలిసి పనిచేద్దాం.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అనేకరైల్వేప్రాజెక్టులకు అవసరమైన భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తే, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, మరింత మొత్తంలో రైల్వే నెట్ వర్క్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *