రజానగరం గ్రామంలో మసీదు నిర్మాణానికి నీళ్లు పెడుతూ గ్రామానికి చెందిన
నాగూర్ బాష (20) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆదివారం ఉదయం వేళ నీళ్లు పెట్టటానికి వెళ్లి ఇక గ్రామంలో కనిపించలేదు. గ్రామానికి చెందిన పలువురు యువకులు కొత్తపట్నం బీచ్ కు వెళ్లారు. వారితో పాటు వెళ్లి ఉంటారని భావించిన తల్లిదండ్రులు సాయంత్రం వరకు ఉంచి పోయారు. తర్వాత యువకులను విచారించిన మీదట మాతోటి రాలేదని చెప్పటంతో ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో వెతుకగా, మసీదుకు, సమీప నివాసం గోడకు మధ్య శవమై ఇరుక్కు పోయి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన గ్రామస్తులు విషయాన్ని తల్లిదండ్రులు మహమ్మద్ ఆనీఫ్ కు తెలిపారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, అందివచ్చిన కుమారుడు మృతి చెందటంతో శోక సముద్రంలో మునిగి పోయారు. విషయం తెలిసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మృత దేహాన్ని నందర్శించి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. సర్పంచి వలి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్డి, రాముడు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
