సాగులో నమస్యలు సూక్ష్మంగా గమనించి అధిక మించినట్లయితే సాగు ప్రశాంతంగా జరిగిపోతుందని కేవికే శాస్త్రవెత్త టి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో బాగంగా వెలుగు వారి పాలెంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లకు అనుకూలమైన వాతావరణం ఏర్పడితే వాటిని అధిక మించటానికి సీజన్ కు ముందుగా గాని, సీజన్ కు కొంత ఆలస్యంగా గాని విత్తుకుంటే ముఖ్యంగా వరిలో ఉల్లి కోడ్ తెగులు నివారించవచ్చని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. వేసవి దుక్కుల వలన కలిగే ఉపయోగాలను వివరించారు. పచ్చిరొట్ట విత్తనాలు రాయితీ పై పొందాలని, స్పింక్లర్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం రాయితీతో ఇస్తున్నట్లు చెప్పారు. హెచ్ ఈ ఓ స్వర్ణలత మాట్లాడుతూ ఉద్యాన వన పంటలు మొక్కలు రాయితీపై అందుబాటులో ఉన్నట్లు తెలిపారు, థైవాన్ స్పేయర్లు, పండ్ల కొమ్మల కత్తెరలు, మినీ ట్రాక్టర్ ముందుకు వారి నగదు చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత వారి ఖాతాలో నగదు జమ అవుతుందని చెప్పారు. డ్రోన్ వినియోగంపై వివరించారు. నర్పంచి కోటేశ్వరమ్మ, సెక్రటరీ పులి సుబ్బా రెడ్డి, ఇఫ్ కో కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి, విఏఏ సుష్మా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
