ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగ, ధ్యానం బాగం చేసుకోవాలని వక్తలు అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో సోమవారం యోగాంధ్రలో బాగంగా యోగపై అవగాహన కల్పిస్తూ ఎంపీడీఓ దార హనుమంతరావు, తహసీల్దార్ సంజీవ రావు, తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ, ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దార హనుమంతరావు తెలిపారు. యోగా వలన కలిగే ప్రయోజనాలను వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి వివరించారు. అనంతరం వెల్లపల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు. ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకుడు సానికొమ్ము సత్యం, ఎపీఎం దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

