యోగాంధ్ర‌ క్యాంపెయిన్లో భాగంచేసే ల‌క్ష్యంతో జిల్లా వ్యాప్తంగా యోగ ర్యాలీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాము – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

జిల్లాలోని అన్నీ వర్గాల ప్రజలను యోగాంధ్ర‌ క్యాంపెయిన్లో భాగంచేసే ల‌క్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ఈ రోజు యోగ ర్యాలీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన యోగ ర్యాలీ ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు బిఎన్. విజయకుమార్, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలసి జెండా ఊపి ప్రారంభించి యోగ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ యోగ ర్యాలీ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, జిల్లాలోని అన్నీ వర్గాల ప్రజలను యోగాంధ్ర‌ క్యాంపెయిన్ లో భాగంచేసే ల‌క్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సంవత్సరం జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి పాల్గొనుచున్న నేపధ్యంలో సుమారు 5 లక్షల మందితో వైజాగ్ లో యోగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గత నెల 21వ తేదీ నుండి యోగాంధ్ర క్యాంపెయిన్ ను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగ ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన సుమారు 10 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులతో యోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేసేందుకు అందరు కృషి చేయాలన్నారు. యోగాస‌నాల ద్వారా ప్ర‌తినిత్యం ఆరోగ్యంగా కొత్త ఉత్తేజంతో ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చన్నారు. ప్ర‌తిరోజూ త‌మ దిన‌చ‌ర్య‌లో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకోవాల‌ని సూచించారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ….యోగా ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేందుకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా రోజుకొక కార్యక్రమంలో జిల్లాలో యోగ అవగాహన కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ సంవత్సరం జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి పాల్గొనుచున్నారని, ఈ యోగ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనుచున్నారన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ… యోగాస‌నాలతో ఒక్క శారీర‌క ఆరోగ్య‌మే కాకుండా మాన‌సిక ఆరోగ్య‌మూ సొంత‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. యోగా ప్రాధాన్యతను, ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేందుకు ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణాల్లో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ… యోగ పై ప్రజల్లో అవగాహన కల్పించడం, యోగ ప్రాధాన్యతను, అవసరాన్ని తెలియచేయడంలో భాగంగా జిల్లా లోని పర్యాటక ప్రదేశాల్లో, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుచున్నదన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… హెల్తీ ఆంధ్ర ప్రదేశ్లో భాగంగా ఈ రోజు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో, మండల కేంద్రంలో మరియు జిల్లా కేంద్రంలో యోగ ర్యాలీ లు నిర్వహించడం జరుగుచున్నదన్నారు. యోగా ఆరోగ్యానికి మంచిదవుతుందని, యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ యోగ ర్యాలీ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డిపిఓ వెంకట నాయుడు, మెప్మా పిడి శ్రీహరి, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాస రావు, ఆయుష్ శాఖ ఆర్డిడి పద్మజాతి, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, యోగ సాధకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *