ప్రతి విదార్ది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు పట్టువిడవకుండా కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

ప్రతి విదార్ది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు పట్టువిడవకుండా కృషి చేసినట్లయితే అనుకున్నది సాధించినవారౌతారని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులో గల సాయిబాబా సెంట్రల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు బి ఎన్ విజయకుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, ఎపి లైవ్ స్టాక్ డవలప్మెంట్ ఏజెన్సీ కార్పోరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ లతో కలసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో 10వ తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన 242 మంది 10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులను, 36 మంది ఇంటర్ విద్యార్థిని విద్యార్థులను సత్కరించి, సర్టిఫికెట్, మెడల్ మరియు 20 వేల నగదు పురస్కారంను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలం నుండి అత్యధిక మార్కులు పొందిన ఆరుమందిని ఎంపిక చేసి ఈ రోజు అవార్డు ప్రదానం చేయడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో మొత్తం 242 మంది పదవ తరగతి విద్యార్దినీ విద్యార్ధులు, 36 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధినీ విద్యార్థులను సత్కరించి, సర్టిఫికెట్, మెడల్ మరియు 20 వేల నగదు పురస్కారంను ప్రధానం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విదార్ది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు పట్టుదలతో కృషితో సాధన చేసినట్లయితే కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి నిర్దేశించుకున్న లక్ష్యం సాధించేవరకు పట్టువిడవకుండా కృషి చేసినట్లయితే అనుకున్నది సాధించినవారౌతారన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సామర్ధ్యాన్ని గుర్తించి వారి సామర్ధ్యానికి అనుగుణంగా తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ప్రకాశం జిల్లాలో చదువుచున్న విద్యార్ధులు బాగా చదువుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు., ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ… ఈ రోజుల్లో చదువు అనేది చాల ముఖ్యమని, చదువు కుంటేనే భవిష్యత్ ఉంటుందన్న ఉద్దేశ్యంతో విద్యార్ధులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. నేడు కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను ఆధునీకరించి అవసరమైన మౌలిక సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. విద్యార్ధులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును అందిపుచ్చుకొని బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని సూచించారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ మంచిగా చదువుచున్న విద్యార్ధులను ప్రోత్సహించాలన్నదే ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే అది విద్య ద్వారానే సాధ్యమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు జీవితంలో పైకి రావాలంటే చదువు ఒక్కటే దారని అన్నారు. కుటుంబంలో ఒకరు బాగా చదువుకుంటే ఆకుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుందని అన్నారు. ప్రతి విద్యార్ధి జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి పట్టుదలతో పైకి వచ్చేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్ధులకు సూచించారు.

నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, బాగా చదువుకుంటున్న విద్యార్ధులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుచున్నదన్నారు. తలరాత మార్చేది చదువు ఒక్కటేనని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మా కంటే బాగా జీవించాలని అనుకుంటారని, ఆ తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు తమ వంతు కృషి చేయాలని మేయర్, విద్యార్ధులకు సూచించారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.

ఎపి లైవ్ స్టాక్ డవలప్మెంట్ ఏజెన్సీ కార్పోరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా విద్యా రంగంలో ప్రధమ స్థానంలో నిలవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదుగాని, చదివించడం అనేది చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే డబ్బు, ఆస్తి ఈ రోజు వుంటుంది రేపు ఉండదు. అదే విద్య అనేది శాశ్వతంగా మన బిడ్డలకు అందించే ఆయుధమని, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి కిరణ్ కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, విద్య శాఖ అధికారులు, విద్యార్ధినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *