బేగంపేట జూన్ 10 (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 204 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 45, రెవెన్యూ శాఖకు సంబంధించి 45, ఇందిరమ్మ ఇండ్ల కోసం 41, విద్యుత్ శాఖకు 18, హోం శాఖకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 37 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్స్ పట్ల హర్షం.
2008 డీఎస్సీలో ఎంపీకై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 1,382 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ పోస్టింగ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అందుకు కృషి చేసిన ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లకు సంఘం ప్రతినిధులు ఉమా మహేశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి, పుష్పలత, శారదా, తదితరులు ధన్యవాదాలు తెలిపారు.
