వరుసగా మూడోసారి కేంద్రంలో
అధికారం చేపట్టిన బీజేపి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11 సంవత్సరాల సుపరిపాలనపై మేధావులు ఆలోచించాలని బీజేపి మాజీ రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు కోరారు. వికసిత భారత్ అమృత్ కాలం అయిన 11 సం వత్సరాల మోదీ పాలనపై బుధవారం స్థానిక ఎకేవికె కళాశాల నందు జరిగిన మేధా వుల సదస్సుకు జిల్లాఅధ్యక్షులు శెగ్గం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ… 11ఎళ్ళ మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదగడమే కాకుండా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలామోదీ దేశానికి సుపరిపాలన అందించారని ఆయన గుర్తుచేసారు. భవిష్యత్తులోనూ భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 11ఏళ్ళ కేంద్ర ప్రభుత్వ పాలనపై అన్నివర్గాలప్రజలు ఆలోచించాలని, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణ యాలకు సంపూర్ణమద్దతు పలికి భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తొలుత ఎకెవికెక ళాశాల నందు ఒకమొక్కను నాటారు. ఈసదస్సులో చెంచురామయ్య, మాజీ జిల్లా అధ్యక్షులు పి.వి.శివారెడ్డి, కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు , అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, జిల్లెళ్ళమూడి రమాదేవి, విజయారావు, సత్యవతి, ఆశారావు తదితరులు పాల్గొన్నారు.

