తాళ్లూరు మండలంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయాధికారి ప్రసాద రావు గురువారం అకస్మిక తనిఖీ నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరంలలో పలు దుకాణాలు పరిశీలించి శ్యాంపిల్స్ తీసారు. పరీక్షల నిమిత్తం రీజనల్ కోడింగ్ కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. డీలర్లు బాధ్యతాయుతంగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు అందించాలని తెలిపారు. రైతులు రసీదుల బాధ్యతగా తీసుకుని పంట కాలం పూర్తి అయ్యే వరకు రసీదులు తమ వద్ద ఉంచుకోవాలని కోరారు.
