సుఖీభవ రైతులకు సర్కారు ఊరట – 44.19 లక్షల మంది ఈకేవైసీ వివరాలు ఆటో ఆప్డేట్

రాష్ట్రవ్యాప్తంగా
నాలుగు రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఎడతెగని రద్దీ.. అన్నదాతా సుఖీభవ సాయం అందాలంటే రైతులంతా ఈకేవైసీ (వేలిముద్ర) పూర్తి చేయాలని వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకులు చెప్పడమే ఇందుకు కారణం. అయితే, దీనిపై ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు(ఆర్ఎస్కే) వచ్చి ఈకేవైసీ చేసుకోవా ల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు
మాత్రమే వేలిముద్ర వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వారి జాబితాలను ఆర్ఎస్కలకు పంపించింది. దీంతో అర్హుల గుర్తింపు సులభతరం చేయనుంది. వాస్తవానికి రాష్ట్రంలో 45.65 లక్షల మంది అన్నదాతా సుఖీభవకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 20వ తేదీ లోగా వీరందరికీ ఈకేవైసీ చేయాలని ఆదేశించింది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న రైతులంతా ఒక్కసా రిగా పొలాల పాసుపుస్తకాల నకళ్లు, ఆధార్ కార్డులతో సహా తరలివచ్చారు. అక్కడి సిబ్బంది కూడా ఉదయం నుంచి ఇదే పనిలో నిమగ్నమ య్యారు. అయినా గడువులోగా పూర్తవుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు తీసుకున్న ఈకేవైసీ జాబితాలను అర్హులతో అనుసంధానించారు. మొత్తం 44.19 లక్షల మంది వివరాలు సరిపో లాయి. 1.45 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని తేల్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్టేటస్ చెక్ చేసుకునేదెలా?

చాలామంది రైతుల్లో తాము అన్నదాతా సుఖీ భవకు అర్హులమో.. కాదోనన్న ఆందోళన నెల కొంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్న దాతా సుఖీభవ వెబ్సైట్లో ‘చెక్ స్టేటస్’ ఆప్షన్ ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఆధార్ సంబరు నమోదు చేస్తే అర్హులైన వారి వివరాలు కనిపిస్తాయి. ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసర ముందో లేదో కూడా అక్కడే తెలిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *