క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు బాలల చట్టాలపై అవగాహన కల్పించి వారిని ఉన్నత స్థాయిలో నిలచేందుకు తోడ్పాటు అందించాలని హెల్ప్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్, జాతీయ పురష్కార అవార్డు గ్రహిత బివి సాగర్ అన్నారు. స్థానిక పోలీన్ స్టేషన్లలో ఎన్ఐ మల్లిఖార్జున రావు ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బివి సాగర్ మాట్లాడుతూ గ్రామాలలో బాలికలకు చట్టాలపై అవగాహన లేక చిన తనంలోనే బాల్య వివాహాలు చేసుకుంటూ తీవ్ర వేదనకు గురవుతున్నారని అన్నారు. లైంగిక దోపిడి వేదింపులకు గురవుతున్నారని అన్నారు. వారికి మనోధైర్యం కలిగించి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలని కోరారు. బాలికలు అపోహకలకు, అత్యాశకు గురై ప్రేమ పేరుతో మమోసంలో పడి చిన్న వయస్సులో అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఐసీడీఎన్, రెవిన్యూ, పోలీన్ వ్యవస్థల సమన్వయంలో బాల్య వివాహాలను అరికట్టాలని కోరారు.
