తాళ్లూరు మండలం లోని పంచాయితీలలో వసూలు చేసిన పన్నులను స్వర్ణ పంచాయితీ యాప్
లో నమోదు చేసుకోవాలని ఎంపీడీఓ దార హనుమంత రావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లాలో స్వర్ణ పంచాయితీ యాప్ నమోదులో తాళ్లూరు మండలం వెనకంజలో ఉన్న విషయాన్ని జిల్లా అధికారులు సైతం తమ దృష్టికి తీసుకువచ్చారని, రెండు రోజులలో అన్ని పంచాయితీ బిల్లుల వసూలు రసీదులను యాప్లో నమోదు చేయ్యాలని లేదంటే చర్యలు ఉంటాయని అన్నారు. పంచాయితీలలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 21న యోగాంద్ర విజయవంతం చెయ్యాలని కోరారు.
