కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)పై నేటి జర్నలిస్ట్లకు అవగాహన తప్పనిసరి అని ఎపీ ప్రెస్ అకాడమి చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ అన్నారు. ఒంగోలు ఎన్ టి ఆర్ కళా క్షేత్రంలో మంగళవారం 36వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా కృత్రిమ మేధ – సామాజిక మాధ్యమాలు – వాస్తవాల నిర్ధారణపై సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర ఎపీయూడబ్యుజి అధ్యక్షడు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎపీ ప్రెస్ అకాడమి చైర్మన్ అలపాటి సురేష్ కుమార్, తెలంగాణ ప్రెస్ ఆకాడమి చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి, ఐజియూ జాతీయ కార్యదర్శి సోమ సుందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, విశాలాంధ్ర దిన పత్రిక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కె అజయ్, పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఎపీ ప్రెస్ అకాడమి చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ….. వాస్తవాలకు దగ్గరగా ఉండేలా వార్తలు ఉండాలని కోరారు. వార్తలకు నిజ నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని కోరారు. తెలంగాణ ప్రెస్ ఆకాడమి చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలతో నిజాలను తెలుసుకుని ప్రచురించాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చట్టాలు ఉన్నాయని, సోషల్ మీడియాకు ఎటువంటి చట్టం లేదని, సామాన్య చట్టమే అమలు అవుతుందని చెప్పారు. పలు ఉదాహరణలో వివరించారు. ఐజియూ జాతీయ కార్యదర్శి సోమ సుందర్ మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు ప్రతిభింబిచే విధంగా వార్తలు ఉండాలని . కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని కోరారు. విశాలాంధ్ర దిన పత్రిక ఆసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కె అజయ్ కృత్రిమ మేధకు ఉన్న ప్రాముఖ్యత, దేశంలో సోషల్ మీడియాను అనుసరిస్తున్న వారి వివరాలు గణాంకాలతో వివరించారు. లో కాస్ట్ నో కాస్ట్లో వార్తలను తయారు చేసుకోవటానికి కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ నిపుణులు, జర్నలిస్ట్ ముద్ధం స్వామి మాట్లాడుతూ ఫేక్ వార్తలు, కాఫీ వార్తలు చెక్ చేసుకోవటానికి ఉపయోగపడే పలు సాఫ్ట్ వేర్ యాప్ల గురించి వివరించారు. ఫేక్ వార్తల వలన సమాజంలో ఇబ్బందులు పడుతున్న వారి గురించి ఉదాహరణతో వివరించారు. పలు నైపుణ్యాల గురించి తెలిపారు. ఎపీయూడబ్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్ట్ అర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ఉపయోగించుకోవటం వలన కలిగే ప్రయోజనాలు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఐజేయూ జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.వి.సిన్హా లు సమాజంలో జర్నలిస్టుల బాధ్యత సమాజం అభివృద్ధిలో వారి పాత్ర గురించి ప్రసంగించారు.
అనంతరం అతిథులకు రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సబ్బా రావు, కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ సురేష్, జిల్లా అధ్యక్షుడు ఎన్.వి రమణ, జిల్లా కార్యదర్శి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు బి వెంకట రావు, ఉపాధ్యక్షుడు ఇష్టేకర్ బాష, అర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ల మురళి, కోట సురేష్ కుమార్ రెడ్డి, మండల లక్ష్మి ప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించారు.




