ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 1290 కోట్ల వ్యయం తో చేపట్టనున్న త్రాగునీటి పధకం శంకుస్థాపన మహోత్సవానికి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురంనకు విచ్చేస్తున్న నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా రూ.1290 కోట్ల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పధకం శంకుస్థాపన మహోత్సవానికి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మార్కాపురం పర్యటనపై బుధవారం మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి జిల్లా అధికారులతో సమావేశమై ముందస్తు ఏర్పాట్లు పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు కేటాయించిన విధులను సమర్థంగా నిర్వర్తించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి వచ్చే హెలిప్యాడ్ మరియు సభా వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంపై అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్ధంగా నిర్వహించడంతో పాటు అవసరమైన ప్రదేశాల్లో మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సుమారు పది వేల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని, అందుకనుగుణంగా సభా వేదిక, పార్కింగ్ ప్రదేశాల్లో బ్యారికేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. సభా వేదిక ప్రాంగణంలో అవసరమైన మెడిసిన్ తో వైద్య సిబ్బందిని నియమించాలని, కార్యక్రమానికి హాజరు ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా సీటింగ్ ఏర్పాట్లు తో పాటు మంచినీరు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, మార్కాపురం డి ఎస్ పి నాగరాజు, జన సేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇంచార్జి ఇమ్మడి కాశినాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, స్థానిక శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, లతో కలసి సభా , హెలిప్యాడ్ మరియు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లు పై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.



