గత వైసీపీ పాలనలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలోపూర్తి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నదని మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా బొద్దికూరపాడులో మండల టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారకార్యక్రమం శుక్రవారం చేపట్టారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూటీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మూడు ఉచిత గ్యాస్సిలెండర్లు, పెన్షన్ పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, పశుపోష కులకు పశువుల షెడ్లు మంజూరు చేసి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నదన్నారు. గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పనుల తాలుకూ పత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామటీడీపీ అధ్యక్షులు పి. సుబ్బారెడ్డి, మండల మాజీ అధ్యక్షులు ఓబులరెడ్డి, పి.రమణారెడ్డి, రాచకొండ వెంకట్రావు , వీరనాగిరెడ్డి, బాలశంకరరావు, శ్రీను, మహిళలు, టీడీపీశ్రేణులు పాల్గొన్నారు.
