ప్రకృతి వ్యవసాయం చేరువ చేయటమే లక్ష్యం – డిపీఎం సుభాషిణి

ప్రతి రైతు గ్రామంలో వంద ఎకరాలు పొలం గట్లపై పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయలు మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం బి సుబాషిణి అన్నారు. మండలంలోని రామ భద్రాపురం,తూర్పుగంగవరంలలో శుక్రవారం పర్యటించారు. రైతులను చైతన్య వంతులను చేసి ప్రకృతి వ్యవసాయం చేరువ చేయటమే లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు. వరి నాటిన క్షేత్రాల వద్ద పొలం గట్లపై బొప్పాయి, కంది , మునగ, మిరప, చిలకడ దుంప, క్యారేట్ ఆకు కూరలు నాటించి రైతులకు దాని ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్య పరస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని సాంప్రదాయ పద్ధతులలో కాకుండా ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ఉన్న అవకాశాలను, వనరులను వినియోగించు కొని నాలుగు రకాలుగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రకృతి సాగు ఇన్చార్జిలు ప్రభాకర్, పి నరిసింహులు ఐసీ ఆర్ ఏ లు కోటి రత్నం, అనంత లక్ష్మి, వాణి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *