రెవిన్యూ సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ చూపి పరిష్కారంవేగవంతంగా ఉండేలా చూడాలని తహసీల్దార్ లక్ష్మి నారాయణ అన్నారు. తాళ్లూరు ఆయన కార్యాలయంలో శుక్ర వారం విఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు నచివాలయాల సేవలు వేగవంతం చెయ్యాలని, హైవేకి భూములిచ్చిన రైతుల పరిహారం ఏవైనా ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతుల పరిష్కారం వేగవంతం చెయ్యాలని కోరారు. రైన్ కార్డుల దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ఇచ్చిన లక్ష్యాలను త్వరగా పూర్తి చెయ్యాలని సూచించారు. ఆరో అనూష తదితరులు పాల్గొన్నారు.
