“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి – ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలను నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, శ్రీ జాన్సన్, పార్ధసారధి, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. నిబంధనల మేర ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను స్పష్టంగా ధరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారంచూపాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *