ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం తో
పాటు అవసరమైన ల్యాండ్ సేకరణ వివరాలను సమగ్రంగా రూపొందించాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ల కు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పిజిఆర్ఎస్ లో రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తుల పెండేన్సి, ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియతదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారికి నివేశన స్థలం కేటాయించేందుకు అవసరమైన ల్యాండ్ ను గ్రామాల వారీగా గుర్తించి వివరాలను పంపాలన్నారు. జిల్లాల్లో పిజిఆర్ఎస్ లో రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లో లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రిజెక్ట్ అయిన దరఖాస్తులను వంద శాతం ఆడిట్ టీం చేత తిరిగి పరిశీలన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పై ఐవిఆర్ఎస్ సర్వేలో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.
