పారదర్శకమైన ఓటరు జాబితా ను రూపొందించడంలో బిఎల్ఓ ల భాద్యతలు కీలమని, కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, బిఎల్ఓలకు సూచించారు.
మంగళవారం ఒంగోలు ఎన్టిఆర్ కళాక్షేత్రంలో ఓటర్ జాబితా తయారీ, బిఎల్ఓ యాప్ నిర్వహణ పై ఒంగోలు నియోజక వర్గానికి సంబంధించి బిఎల్ఓ లకు, బిఎల్ఓ సూపర్వైజర్స్ కు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ పాల్గొని మాట్లాడుతూ, పారదర్శకమైన ఓటరు జాబితా ను రూపొందించడంలో బిఎల్ఓ ల భాద్యతలు కీలమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారి చేసిన మార్గదర్సకాలకు సంబంధించి ఓటర్ జాబిత రూపొందించడం లో బిఎల్ఓ యాప్ నిర్వహణ పై బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్స్ క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఓటర్ జాబితా రూపకల్పన పటిష్టంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్ డి ఓ లక్ష్మి ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహసిల్దార్ మధుసూదన్ రావు, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.

