జిల్లా పోలీసు కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లు కోటేశ్వరరావు ,ప్రభాకర వర్మ లకు సీనియర్ అసిస్టెంట్ లగా పదోన్నతి పొంది మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి అభినందనలు తెలియచేసినారు. ఎప్పటికప్పుడు నిరంతర శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, మరియు బాధ్యతాయుతమైన కృషి ద్వారానే పదోన్నతులు సాధ్యమవుతాయని, పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని, ఇకపై మరింత నిబద్ధత గా విధులు నిర్వర్తించాలని తెలియజేశారు.

