పోలీస్ శాఖ ఆధునీకరణను లక్ష్యంగా తీసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రాజెక్టు కింద ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్లకు ఆధునిక డిజిటల్ పరికరాలు అందించటం జరిగింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
పోలీస్ స్టేషన్ అధికారులకు ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు, ప్రింటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ….“ప్రతి పోలీస్ స్టేషన్లో టెక్నాలజీ వినియోగం పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోదని, సీసీటీఎన్ఎస్ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక కంప్యూటర్లు, కెమెరాలు, ప్రింటర్లు అందించబడ్డాయన్నారు. ఈ కొత్త ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు సీసీటీఎన్ఎస్కు అనుకూలంగా రూపొందించబడి, కేసు నమోదు నుండి దర్యాప్తు, విచారణ, న్యాయ ప్రక్రియ మరియు కేసు ఫైనల్ డిస్పోజల్ వరకు సాగే ప్రతి దశను డిజిటల్‌గా ప్రాసెస్ చేసేలా తయారు చేయబడ్డాయి. వీటిలో సీసీటీఎన్ఎస్ కు అవసరమైన అన్ని అప్లికేషన్లు ముందుగానే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. జిల్లాకు పంపిణీ చేసిన పరికరాలు:ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు – 176,వెబ్ కెమెరాలు – 44,ప్రింటర్లు – 48,
పాత టెక్నాలజీకి బదులుగా ఈ నూతన కంప్యూటర్లు పోలీస్ శాఖ పనితీరును వేగవంతం చేస్తాయని అధికారులకు తెలిపారు. ఈ సిస్టం ద్వారా కేసుల వివరాలు మరింత పారదర్శకంగా ఉండేలా చేస్తూ, ప్రజలు తమ కేసుల స్థితిగతులను ఆన్లైన్లో తేలికగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా క్రిమినల్ డేటాను ఎక్సెస్ చేయగల సామర్థ్యం కలిగిన కంప్యూటర్‌తో పనిచేయగలుగుతుందని, ఇది క్రైమ్ అనలిసిస్, డేటా ఇంటిగ్రేషన్, నేరాల నిరోధం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వర్చువల్ విచారణలు, వీడియో రికార్డింగ్, సాక్ష్యాల డిజిటల్ స్టోరేజ్ వంటి ఆధునిక విధానాలకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి.
రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శనంలో ఈ టెక్నాలజీ నవీకరణలో భాగంగా ఐ సి జె ఎస్ 2.0 ద్వారా ఈ సిస్టములను పంపిణీ జరిగిందన్నారు. పోలీస్ శాఖలో తక్షణ స్పందన, సమర్థ దర్యాప్తు, ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో అమలవుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, సీఐలు సుధాకర్, నాగరాజు, శ్రీనివాసరావు, విజయకృష్ణ, యన్. శ్రీకాంత్, హాజరత్తయ్య, డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఆర్ఐ లు సీతారామిరెడ్డి, రమణారెడ్డి ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






