వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం తాడేపల్లిలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ను డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ లు పరామర్శించారు. పార్టీ, తాము అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఒక బీసీ మహిళ పార్టీ సమావేశానికి వెళ్తుంటే ఆమె వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆమెపై దాడికి పాల్పడడం సబబు కాదన్నారు. అనంతరం వారు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

