పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి 4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి 4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సి.ఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశమై పీ4 కార్యక్రమం అమలు తీరు, ఎంఎస్ఎస్ఈ పార్కుల ఏర్పాటు, సానుకూల ప్రజా అవగాహన, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనపై 5 సూచనలు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనపై 5 సూచనలు, తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, డిపిఓ వెంకటనాయుడు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బాల శంకర రావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస రావు, డి ఎస్ ఓ పద్మశ్రీ, డి ఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ… పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి 4 కార్యక్రమం అమలుపై ప్రభుత్వం జారీచేసిన షెడ్యులు ను కచ్చితంగా అమలు చేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పి 4 కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలను గుర్తించి ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని సిఎస్., జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు అవసరమైన భూమిని వెంటనే గుర్తించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రేషన్, ఎపిఎస్ఆర్టిసి, పంచాయతీ రాజ్, పౌర సరఫరా శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రజా సేవల పై ప్రజల సంతృప్తి స్థాయిని సమీక్షిస్తూ, సంబంధిత శాఖల ద్వారా అమలు చేస్తున్న సేవల పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసేలా కార్యక్రమాల అమలు తీరును సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లాలో ఈనెల 19న మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఈ మాసం లో “ ప్లాస్టిక్ కాల్యుషం అంతం ” అనే అంశంతో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. నిత్యా జీవితంలో ప్లాస్టిక్ వినియోగం ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా ఆరోగ్యంపై కలిగించే దుష్ప్రభాలపై ప్రజలకు అవగాహన కలిగించి, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం క్రింద ఎంపిక కాబడిన గ్రామాల అభివృద్ధి కొరకు చేపట్టిన పనులు త్వరగా పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *