వివిధ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో పటిష్ట భద్రత మధ్య పరీక్షలు జరుగుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జిల్లావ్యాప్తంగా ఆరు సెంటర్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం ఒంగోలు నగరం మామిడిపాలెంలోని
నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో మాత్రమే పరీక్షలు జరిగాయి. ఉదయం పరీక్షకు 49కు గాను 29 మంది, మధ్యాహ్నం పరీక్షకు 77కి గాను 35 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు.
