వైవాహిక జీవితం ప్రారంభించే నూతన జంటలకు ఫ్రీ మారిటల్ కౌల్సిలింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా పేర్కోన్నారు. జిల్లా స్పందన సమావేశపు మందిరంలో సోమవారం ఫ్రీ మారిటల్ కౌల్సిలింగ్ పోస్టర్స్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కౌల్సిలింగ్ కేంద్రాల వలన వివాహం చేసుకోబోయే జంటలకు వివాహం తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి . ఆర్థిక విసయాలు గురించి, ఒకరినొకరు అర్థం చేసుకునే అంశాల గురించి వివరింగా తెలుసుకుంటారని చెప్పారు. పిల్లల పెంపకం వంటి అంశాలపై ఏకాభి ప్రాయానికి రావటం వలన వివాహం తర్వాత వచ్చే ఇబ్బందులను సులభంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ కౌల్సిలింగ్ వలన సంతోషకరమైన కుటుంబ వ్యవస్థ ఏర్పాటుకు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ . స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ, డిఆర్ఓ చిన ఓబు లేసు, సఖి అడ్మిన్ జోఓ్యతి సుప్రియ, పీఎఫ్ఓ గౌతమి, లాయర్ స్పందన, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
