బేగంపేట ఆగస్టు 9 జే ఎస్ డి ఎం న్యూస్ :
ఆలయాలు ఆధ్యాత్మిక చింతన నిలయాలు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బన్సీలాల్ పేట డివిజన్ లోని గాంధీ నగర్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సాయిబాబా కు పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శాంతి కుమార్, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

