హైదరాబాద్, ఆగస్టు 9,జే ఎస్ డి ఎం న్యూస్ :
సోదరుడికి రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటైతే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం . ఆసాధారణ మైన విషయం. దానికి ఎంతో ధైర్యం కావాలి. మానవ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ రోజుల్లో, ఒక అక్క తన తమ్ముడి కోసం తన ప్రాణాలకే సవాలు విసిరింది.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడికి తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియా—అంటే ఎముక మజ్జ లోపంగా నిర్ధారణ అయ్యింది. ఇంటర్ చదువుతున్న అక్క తమ్ముడికి ధైర్యం చెప్పి, తన శరీరంలోని మూలకణాలను దానం చేసి అతని ప్రాణాన్ని రక్షించింది. రాఖీ పండుగ రోజున సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో తమ్ముడికి రాఖీ కట్టి, “నీ కోసం నేను ఉన్నాను తమ్ముడు” అని ప్రేమగా చెప్పింది.ఈ సంఘటన ప్రతి హృదయాన్ని ఎంతగానో కదిలించింది.ఈ సందర్భంగా డా. నరేందర్ కుమార్ తోట మాట్లాడుతూ, ఇది అక్కా–తమ్ముళ్ల అనుబంధానికి నిజమైన నిదర్శనం అని, అపోహలను పక్కన పెట్టి ధైర్యంగా తమ్ముడి ప్రాణం కాపాడిందని అన్నారు.ఇలాంటి సోదరి ఉన్నందుకు ఆమె తమ్ముడు ఎంతో ఆనందంగా ఉన్నాడు.ప్రతి కుటుంబంలో ఇలాంటి అక్కా,చెల్లి ఉంటే ఎంతో బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
