తాళ్లూరు మండలంలో రీ వెరిఫికేషన్ సందర్భంగా మే నెల 26 న దర్శి లో నిర్వహించిన క్యాంపు ఫలితాలు గురువారం అందాయి. అందులో పలువురు దివ్యాంగుల దివ్యాంగత్వం పర్సింటేజ్లు 40 కన్నా తగ్గింపు ఇవ్వటంతో పెన్షన్లు కోల్పోయారని దివ్యాంగుల నాయకులు తెలిపారు. నిజమైన అర్హత ఉండి కూడ నిర్లక్ష్యంగా వెరిఫికేషన్ చేయటం వలననే ఇటువంటి పరిస్థితి వచ్చిందని వివరించారు. నాగంబొట్ల పాలెంకు చెందిన చిమటా త్రివేణి మంచంలో నుండి లేవలేని పరిస్థితి, అంజి బాబు పోలియోతో చిన నాటి నుండి ఇబ్బంది పడుతూ పెన్షన్ వస్తున్నది. అదే విధంగా లక్కవరంకు చెందిన సంపత్ వెంకట తేజ నడవలేని పరిస్థితి ఉన్నది. మండలంలో మల్కాపురం, తాళ్లూరు -1, 2, దోనకాయలపాడు, నాగంబొట్ల పాలెం, లక్కవరం, బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెం, శివరామపురంలలో 123 మంది పెన్షన్ దారులకు వికలావత్వం నమోదు తగ్గించటంతో సెప్టెంబర్ నెలలో వారికి పెన్షన్ వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. వారికి తిరిగి వెరిఫికేషన్ చేయించి న్యాయం చెయ్యాలని దివ్యాంగుల నాయకులు కోరుతున్నారు.

