ఆత్మ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి సాగు వైపు పయనించటం పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నాగంబొట్ల పాలెం రైతు సేవా కేంద్రం పరిధిలో గురువారం వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్ర వెత్త మానన మాట్లాడుతూ పంట సాగులో వైవిధ్యత, అవనరమైన మేరకు రసాయన ఎరువులు వాడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించి యూరియా వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల గురించి వక్తలు వివరించారు. నర్పంచి చిమటా సుబ్బా రావు, ఆత్మ బిటీఎం శేషా రావు, ఎటీఎం రామి రెడ్డి, ప్రకృతి వ్యవసాయ ఐసీఆర్పీలు నరసింహాం తదితరులు పాల్గొన్నారు.


