ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు వినతి

తాళ్లూరు మండలంలో ఎపీఎన్ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ చెయ్యాలని పలు గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, ప్రజలు ఆర్టీసీ అధికారులకు విన్నవించారు. అద్దంకి నుండి బౌద్దికూరపాడు బస్సు ను ఆదివారం కూడ సర్వీసును కొనసాగించాలని అదే విధంగా సాయంత్రం వేళ కూడ రెగ్యులర్ గా నర్వీసు వచ్చేలా చూడాలని కోరారు. ఉదయం 9 గంటలు దాటితే బొద్దికూరపాడు నుండి మండల కేంద్రానికి చేరుకోవటానికి ఎటువంటి సర్వీసులు లేవని చెప్పారు. నియోజక వర్గ కేంద్రం దర్శి నుండి వయా రాజంపల్లి, బొద్దికూరపాడు, తూర్పుగంగవరం మీదుగా తాళ్లూరుకు బస్సు నర్వీన్ నడపాలని కోరారు. అదే విధంగా పొదిలి నుండి విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీస్ను పునరుద్దరించాలని, రాను పోను సర్వీసు రెగ్యులర్గా ఉండే విధంగా పొదిలి డిపో మెనేజర్ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అడ్డంకి డిపో నుండి శ్రీశైలం నర్వీస్ను రెగ్యులర్గా నడపాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం పూర్తిగా అమలు కావాలంటే నర్వీసులు అన్ని ఉంటేనే బాగా ఉపయోగపడతాయని లేదంటే నిరుపయోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని 20గ్రామాల నర్పంచిలు, ఎంపీటీసీలు, ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *