బేగంపేట ఆగస్టు 22(జేఎస్ డిఎం న్యూస్) :
శ్రావణమాసం చివరి రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు .ఆషాఢ బోనాల సందర్భంగా అమ్మవారు రంగంలో కోరిన విధంగా మహిళా భక్తులు అమ్మవారికి సాక సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మహాకాళి ఆలయానికి తరలివచ్చారు. సాక లు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం చివరి రోజు కావడం ,శుక్రవారం కావడం,తో అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరాల పరిధి నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు .ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అంద జేశారు. శ్రావణమాసం చివరి రోజు కావడంతో ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని పూలు పండ్లతో సుందరంగా ముస్తాబు చేశారు.



