మానం నుబ్బా రత్నం మానవతా మూర్తి – డాక్టర్ గొట్టిపాటి – నుబ్బా రత్నంకు ఘన నివాళి అర్పించిన టీడీపీ శ్రేణులు

టిడిపి పార్లమెంటు నియోజక వర్గ కార్యనిర్వాహణ కార్యదర్శి, సీనియర్ నాయకుడు మానం
రమేష్ బాబు సతీమణి మానం సుబ్బా రత్నం మానవతా మూర్తి అని ఆపార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. సుబ్బా రత్నం సంస్మరణ సభ గురువారం విఠలాపురంలో నిర్వహించారు. సభకు డాక్టర్ గొట్టిపాటి హాజరై సుబ్బా రత్నం చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మానం రమేష్ బాబు రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన కుటుంబం కావటంతో నిత్యం అనేక పనులపై ఆయన వద్దకు వెళ్తున్న కార్యకర్తలను స్వంత అన్నదమ్ములా భావించి అతిథి మర్యాదలు చేసేదని వక్తలు కొనియాడారు. ఆమె సేవలను మననం చేసుకుంటూ పలువురు భావోద్వేగాలకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, యువ పారిశ్రామికవేత్త ఎస్.
సుధీర్ కుమార్, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ పెదకాలేషా వలి (బడే), నాటక సొసైటీ డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర), క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస రావు, నవులూరి విద్యాసాగర్, లక్ష్మి నారాయణ పలు గ్రామాల సర్పంచిలు,
ఎంపీటీసీలు, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *