పేద వారు భోజనం చేసే
అన్నా క్యాంటిన్ ప్రదేశం మరియు పరిసరాలు శుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ
సిబ్బందిని ఆదేశించారు. గురువారం రాత్రి జాయింట్ కలెక్టర్ శ్రీ గోపాల క్రిష్ణ, ప్రకాశం భవనం ఎదురుగా వున్న అన్నా క్యాంటిన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన ఏర్పాట్లను పరిశీలించి పేద వారు భోజనం చేసే అన్నా క్యాంటిన్ ప్రదేశం మరియు పరిసరాలు శుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడుతూ మీరు ఏమి పని చేస్తున్నారు, భోజనం ఎట్లా వున్నది తదితర వివరాలను ఆరా తీసారు. ఆవరణలో పారిశుద్ధ్యం, ప్లేట్ లు వేడినీళ్ళతో శుభ్రం చేయడం, ఆహార నాణ్యత ఉండేలా చూడాలని, ఎటువంటి ఫిర్యాదులకు అవకాశం లేకుండా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సంబంధించి మీడియా ప్రతినిధుల విజ్ఞప్తిని పురస్కరించుకొని అన్నా క్యాంటిన్ ప్రక్కన వున్న ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ మధుసూదన్ రావు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


