మహిళా ఉద్యోగిని పట్ల ఫోన్లో అసభ్య సంభాషణ చేశారన్న ఆరోపణలపై జిల్లాకలెక్టర్ ఆదేశానుసారం తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీవో దారా హనుమంతరావు, తాళ్లూరు పూర్వపు పంచాయతీ కార్యదర్శి ఐ.వి. రమణారెడ్డిలపై డిప్యూటేషన్ బదిలీ వేటు వేస్తూ గురువారం డిపీవో ఎమ్ వెంక టేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి నివేధిక కోసం విచారణకు ఆదేశించి నట్లు సమాచారం. తాళ్లూరు మండల పరిషత్ పరిధిలోని సచివాలయ మహిళా ఉద్యోనిని ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ అసభ్య సంబాషణ చేస్తున్నారని జిల్లా కలెక్ట ర్ తమీమ్ అన్సారియాకు విన్నవించి తగు సమాచారం అందజేశారు. దీనిపై గత డీపీవో వెంకటప్పనాయుడును విచారించాలని ఆదేశించగా ప్రాదమిక విచారణ చేసి నివేదిక జిల్లాకలెక్టర్ కు
అందజేశారు. ఆనివేదిక ఆధారంగా ఇరువురు ఉద్యోగులను క్షమశిక్షణా చర్యల లో భాగంగా డిప్యూటీ ఎంపీడీవో హనుమంతరావును పుల్లలచెరువు మండలానికి, పంచాయతీ కార్యదర్శి గిద్దలూరు మండలం నరవగ్రామ సచివాలయం ల కు డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇరువురు ఉద్యోగులు డిప్యూటేషన్ పై బదిలీ – మహిళా ఉద్యోగితో చాటింగ్ కారణంగా బదిలీ -కలెక్టర్ఆదేశాలతో చర్యలు చేపట్టిన డిపీవో -డిప్యూటీ ఎంపీడీవో పుల్లలచెరువుకు, పంచాయతీ కార్యదర్శి నరవ సచివాలయంకు డిప్యూటేషన్ పై బదిలీలు -పూర్తి నివేధిక కోసం విచారణకు ఆదేశం?
11
Sep