దర్శి నియోజకవర్గ , తాళ్లూరు మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించండి సారూ…

తాళ్లూరు మండల నియోజక వర్గ కేంద్రాలకు పలు పనులపై వెళ్లాలంటే బస్సు సౌకర్యం సక్రమంగా లేక మండల చిరవి గ్రామాలైన బొద్దికూరపాడు, చింతల పాలెం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరం వైపు, నియోజక వర్గ కేంద్రం దర్శి వైపు వెళ్లాలంటే ఉదయం 9గంటల తర్వాత సాయంత్రం 2.30 గంటల వకు బస్సు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదిలిలో ఉదయం 6.45 బస్సులు దేరు బస్సు బొద్దికూరపాడు, తూర్పుగంగవరం మీదుగా ఒంగోలు వెళ్తున్నదని అదే బస్సు తిరిగి రిటర్ ట్రిప్ అదే రూట్ వచ్చి పొదిలి వెళ్లక పోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అదే బన్సు ఒంగోలు నుండి చీమకుర్తి మీదుగా కనిగిరి వెళ్తున్నదని తెలిపారు. ఆ విధంగా కాకుండా ఒంగోలు నుండి దర్శి కి వయా తూర్పుగంగవరం, బొద్దికూరపాడుకు నడిపినట్లయితే అనేక గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎపీఎన్ ఆర్టీసీ అధికారులు, పొదిలి డిపో మెనేజర్ స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకుని ప్రజలకు, మహిళలకు స్త్రీశక్తి పథకం నక్రమంగా వినియోగించుకునేలా ఆర్టీసీ సర్వీసులు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు మహిళలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *