తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓగా తూర్పుగంగవరం పంచాయితీ కార్యదర్శి నాగమల్లేశ్వరిని నియమిస్తూ ఎంపీడీఓ సానికొమ్ము సత్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. డిప్యూటీ ఎంపీడీఓ దార హనుమంత రావు పుల్లల చెరువు మండలానికి బదిలీ అయ్యారు. దీంతో తాళ్లూరు పంచాయితీ కార్యదర్శి షహనాజ్ బేగం ను డిప్యూటీ ఎంపీడీఓగా నియమించగా బాధ్యతలు చేపట్టారు. అయితే మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు మౌకిక ఆదేశాల మేరకు సీనియర్ అయిన నాగమల్లేశ్వరిని డిప్యూటీ ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఒక రోజు పూర్తి కాకుండా వెంటనే ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీఓ బాధ్యతలు మార్చటం మండలంలో తీవ్ర చర్చాంశనీయమైనది.
డిప్యూటీ ఎంపీడీఓగా నాగమల్లేశ్వరి
16
Sep