ఆరోగ్యం, సాధికారిత, సంక్షేమంపై అవగాహన కలిగి ఉండాలి – కస్తూరిబాలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహణ

మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పధకంలో బాగంగా బాలికలకు
ఆరోగ్యం, సాధికారిత, సంక్షేమం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కస్తూరిబా బాలికల వసతి గృహాంలో ప్రిన్సిపాల్ సుజిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఐసీడీఎన్ జిల్లా డిఆర్పి ఎన్ వీరాంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ విద్యార్థులు బాలల హక్కులు, పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు గురించి వివరించారు. మహిళా చట్టాలు, మహిళా సాధికారిత, సంక్షేమం గురించి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. భవిష్యత్ లక్ష్యాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజికంగా యువతులు ఎదుర్కోంటున్న సమస్యల గురించి పరిష్కరించుకోవాల్సిన విధానాన్ని డిఆర్పీ సభ్యురాలు నమాధానం వివరించారు. అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు రమణకుమారి, విజయలక్ష్మి ఎనమ్మ, నాగ బాల , పద్మ, జ్యోతి, అంజమ్మ, చంద్రమ్మ, పద్మజ, సునన్న తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *