పొగాకు పంట నియంత్రణపై ఒంగోలు -2 పొగాకు బోర్డు వేలం కేంద్రంలో గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వేలం నిర్వాహణాధికారి జె తులసి మాట్లాడుతూ బోర్డు సూచించిన పరిమితి మేరకు మాత్రమే పంట సాగు చెయ్యాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని, ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంభించి నాణ్యమైన పొగాకు ను పండించాలని కోరారు. ఐటీసీ డవలప్ మెంట్ మెనేజర్ వెంకటేష్, జీపీఐ మెనేజర్ కిషోర్, పీ ఎన్ ఎన్ మెనేజర్ ఆదిత్య, రైతులు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.
