తాళ్లూరు శాఖ గ్రంధాలయాన్ని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి జీవీ శివా రెడ్డి గురువారం పరిశీలించారు. గ్రంధాలయంలో పుస్తకాలు, వనతులు, ఇతర రికార్డులను పరిశీలించారు. వార్షిక తనిఖీలలో బాగంగా తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. గ్రంధాలయ సెన్ నకాలంలో మంజూరుకు అధికారులకు వినతులు అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని గ్రంధపాలకురాలు విజయకుమారిని కోరారు. అద్దె భవనం సెంటర్ కావటంతో ధుమ్ము, దూళీ ఎక్కువగా వస్తున్నట్లు సీనియర్ రీడర్స్ తెలిపారు. అనంతరం గతంలో భవనం మంజూరు అయిన బాగు చేసిన ఆగిన స్థలాన్ని పరిశీలించారు.
గ్రంధపాలకురాలు విజయకుమారి, బిడీ సీఎల్ నిర్వాహకురాలు పద్మావతి, రిటైర్డు హెచ్ఎం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

