ప్రతి రైతు నుండి తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు మార్గదర్శకాలు రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అన్నారు. జిల్లాలోని స్పందన హాల్ లో జిల్లాలో 2025-26 సంవత్సరంలో తెల్ల బర్లీ పొగాకు సాగు నియంత్రణపై జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధ్యక్షతన కంపెనీ ప్రతినిథులు, వ్యవసాయశాఖ అధికారులు, పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ కంపెనీ ప్రతినిథుల యొక్క ఫోన్ నంబర్లు కూడ రైతులకు, వ్యవసాయ అధికారులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఒప్పంద పత్రం ద్వారా ప్రతి రైతు ఉత్పత్తి చేసిన పొగాకు ను తప్పనిసరిగా కొనుగోలు చెయ్యాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు తమ ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పూర్తి వివరాలతో కూడిన సమీక్షా సమావేశం తిరిగి ఈనెల 26న నిర్వహింస్తామని పూర్తి నివేదికలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు, పొగాకు
బోర్డు రీజనల్ మెనేజర్ ఎస్ రామా రావు తదితరులు పాల్గొన్నారు.

